Thursday, December 19, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల కస్టడీపై తీర్పు రిజర్వు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీపై నాంపల్లి కోర్టు తీ ర్పు రిజర్వ్ చేసింది. సంచల నం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అదనపు ఎస్‌పి లు, ప్రణీత్‌రావును కస్టడీకి కో రుతూ పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యా యస్థానం బుధవారం విచారణ చేపట్టింది. అదనపు ఎస్‌పిలు భుజంగరావు,తిరుపతన్న, ఎస్‌ఐబి మాజీ డిఎస్‌పి ప్రణీత్‌రావు ను ఐదు రోజులు కస్టడీకి ఇ వ్వాలంటూ పోలీసులు కోరా రు. ఈ విచారణలో కస్టడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడానికి గడువు కావాలని నిందితులు తరపు న్యాయవాదులు మంగళవారం కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

ఈ వినతిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించి తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం కస్టడీ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్‌రావును ఇప్పటికే ఓసారి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు, ఈ కేసుకు సంబంధించి కీలక వివరాలను రాబట్టారు. ఇప్పుడు నిందితులందరినీ ఒకేసారి ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని భావించిన పోలీసులు, అదనపు ఎస్‌పిలు సహా ప్రణీత్ రావు కస్టడీ కోసం పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంపై నిందితుల తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News