- Advertisement -
హైదరాబాద్: ఇంటర్‌నేషనల్ స్కూళ్లను మించిన ప్రమాణాలతో గురుకుల విద్యాలయాలను నడుపుతున్నామని ఎంఎల్‌సి స్టీఫెన్‌సన్ తెలిపారు. ఇంటర్‌నేషనల్ స్కూళ్లలో ఏడాదికి ఏడు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. గురుకులాల్లో పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించడం అభినందనీయమని ప్రశంసించారు. ఒక మైనార్టీ గురుకులంలో తాను భోజనం చేశానని అద్భుతంగా ఉందన్నారు. రంజాన్, క్రిస్మస్ పండుగలకు లక్షలాది మంది పేదలకు ప్రభుత్వం కానుకలు ఇస్తోందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పండుగలకు కానుకలు ఇవ్వడం గొప్ప విషయమని స్టీఫెన్ కొనియాడారు.
- Advertisement -