Monday, December 23, 2024

తెలంగాణ సరాసరి 68.68%…. గురుకుల విద్యార్థుల శాతం 93.23%

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఇంటర్మీడియట్ లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి చెందిన విద్యార్థినీ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు.  బెల్లంపల్లి టి.ఎస్.డబ్ల్యూ.ఆర్ జె.సి నుంచి మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగులపేట గ్రామానికి చెందిన గాజుల సాయి కుమార్ గురుకుల పాఠశాల ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో 1000 మార్కులకు 991 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఇంటర్ ఫలితాలలో తెలంగాణ రాష్ట్ర సరాసరి 68.68%కాగా, గురుకుల విద్యార్థుల శాతం 93.23%గా ఉంది. 41 కాలేజీలలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణులయ్యారు.  ఈ సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ లోని తన నివాసంలో సాయి కుమార్ ను శుభాభివందనలు తెలిపి శాలువాతో సత్కరించారు. అధికారులు, అధ్యాపకులు సిబ్బందిని అభినందించారు.  ఈ కార్యక్రమంలో ఆర్ సిఒ కొప్పుల స్వరూప రాణి, ప్రిన్సిపల్ ఐనాల సైదులు, ఎఆర్సీఒ మహేశ్వర్ రావు పాల్గొన్నారు.

Residential schools more results

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News