Sunday, December 22, 2024

ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ వాసులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : సుడాన్‌లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు కారణంగా అక్కడ భారతీయులను తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి ’అనేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా శుక్రవారం సుడాన్ నుంచి భారతీయలను ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని పాలెం విమానశ్రయానికి తీసుకు వచ్చింది. ఈ సందర్భంగా ఢిల్లీకి చేరుకున్న తెలంగాణకు చెందిన17 మంది సుడాన్ బాధితుల తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఢిల్లీలోని విమనాశ్రమయంలో వారికి స్వాగతం పలికి, వారు స్వస్థలాలకు క్షేమంగా వెళ్ళేందుకు చేసిన ఏర్పాట్లను ఆయన వివరించారు.

కాగా గురువారం సుడాన్ నుంచి ముంబాయి ఎయిర్ పోర్టుకు 14 మంది చేరుకోగా వీరితో కలిపి ఇ మొత్తం 31 మంది తెలంగాణ వాసులు చేరుకున్నారు. న్యూ ఢిల్లీ విమనాశ్రయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్ లైన్ కౌంటర్ ద్వారా కొందరిని హైదరాబాద్, ఇతర స్థలాలకు పంపించడంతోపాటు మరి కొందరికి తెలంగాణ భవన్‌లో త్కాలికంగా ఆశ్రయం కల్పించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News