Sunday, January 19, 2025

కార్పొరేషన్ చైర్మన్ల పదవులకు నేతల రాజీనామా

- Advertisement -
- Advertisement -

సిఎస్ శాంతికుమారికి రాజీనామా లేఖలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు కార్పొరేషన్ల చైర్మన్లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం తమ రాజీనామా లేఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పంపించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తమకు అవకాశం కల్పించిన పార్టీ అధినేత కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదేశాలకు అనుగుణంగా రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానకి పనిచేస్తామని ప్రకటించారు.

రాజీనామా చేసింది వీళ్లే:

1. బోయినపల్లి వినోద్‌కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
2. సోమా భరత్‌కుమార్, రాష్ట్ర డెయిలీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్
3.జూలూరి గౌరీ శంకర్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్
4.దూదిమెట్ల బాలరాజు, గొర్రెలు, మాంసాభివృద్ధి సంస్థ చైర్మన్
5. రవీందర్ సింగ్, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్
6. కె. వాసుదేవరెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్,
7. మన్నె క్రిశాంక్, టిఎస్‌ఎండిసి చైర్మన్
8. గెల్లు శ్రీనివాస్, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్
9. పల్లె రవికుమార్, గీతవృత్తిదారుల సహకార సంస్థ చైర్మన్
10. పాటిమీద జగన్మోహన్‌రావు, టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్
11. అనిల్ కూర్మాచలం, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్
12. గజ్జెల నగేశ్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్
13. మేడే రాజీవ్‌సాగర్, టిఎస్ ఫుడ్స్ చైర్మన్
14. ఆంజనేయగౌడ్, శాక్స్ చైర్మన్
15. వై.సతీష్‌రెడ్డి, రెడ్కో చైర్మన్
16. రామచంద్రనాయక్, ట్రైకార్ చైర్మన్
17. గూడూరు ప్రవీణ్, టెక్స్‌టైల్ కార్పొరేషన్ చైర్మన్
18. వాల్యానాయక్, జిసిసి చైర్మన్
19. ఆయాచితం శ్రీధర్, తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News