Tuesday, January 21, 2025

బిఆర్‌యస్‌కి ప్రజాప్రతినిధుల రాజీనామా

- Advertisement -
- Advertisement -

టేకులపల్లి : మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు బిఆర్‌యస్ పార్టికి రాజీనామా చేశారు. ఈమేరకు స్థానిక పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు సర్పంచులు, ఎంపిటిసిలు బిఆర్‌ఎస్‌కి మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గోల్యాతండా సర్పంచ్ బోడా నిరోషా, కోయగూడెం సర్పంచ్ ఉమ, సులానగర్ అజ్మీరాబుజ్జి, కుంటల్ల మోకాళ్ల రమాదేవి, బేతంపూడి యదళ్లపల్లి బాబు, తడికలపూడి ఊకే నర్సమ్మ, బర్లగూడెం పూనెం రాంబాబు, గంగారం పాయం సమ్మయ్య, మేళ్లమడుగు మాడే మధు,

శంబునిగూడెం భట్టు బాయమ్మలతో పాటు ఎంపిటిసిలు బేతంపూడి పూర్ణ, సులానగర్ ఉండేటి ప్రసాద్, తడికెలపూడి బానోత్ మౌనిక, పెగళ్లపాడు బానోత్ సరోజలు తాము బిఆర్‌యస్‌కి రాజీనామా చేసి కోరం కనకయ్యకు మద్దతు తెలుపుతున్నట్లుగా ప్రకటించారు. ఖమ్మం పట్టణంలో నిర్వహించే కాంగ్రె జనగర్జన సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు లక్కినేని సురేందర్, కోరం సురేందర్, బోడా మంగీలాల్, బానోత్ శంకర్, గణేష్, రవి, పోషాలు, సంజయ్‌లు ఖమ్మంలో నిర్వహించే జనగర్జన సభకు మండలం నుంచి అధికసంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News