Sunday, January 19, 2025

ఇద్దరు కీలక పోలీస్ అధికారుల రాజీనామా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఇంటలిజెన్స్ లో ఓఎస్డీ పనిచేస్తున్న ప్రభాకర్ రావు సోమవారం రాజీనామా చేశారు.మరో వైపు టాస్క్ ఫోర్స్ లో ఓఎస్డీ పనిచేస్తున్న రాధాకిషన్‌రావు కూడా రాజీనామా సమర్పించారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్‌రావుపై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గతంలో పలు ఆరోపణలు చేశారు. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత బిఆర్‌ఎస్ సర్కార్‌కు అనుకూలంగా పనిచేసే అధికారుల జాబితాను కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘానికి అందించింది.

ఈ తరుణంలో కొందరు అధికారులను ఎన్నికల సంఘం తప్పించింది. ఈ క్రమంలోనే టాస్క్‌ఫోర్స్‌లో ఓఎస్డీగా పనిచేస్తున్న రాధాకిషన్ రావును ఎన్నికల సంఘం టాస్క్ ఫోర్స్ నుండి తప్పించింది. తమ ఫోన్లను కూడ ఇంటలిజెన్స్ అధికారులు ట్యాపింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కాకుండా ఫోన్లను హ్యాకింగ్ కూడా చేస్తున్నారని పోలీసు అధికారులపై రేవంత్ ఆరోపించిన విషయం విదితమే.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బిఆర్‌ఎస్ సర్కార్ లో కీలకంగా వ్యవహరించిన ప్రభాకర్ రావు , రాధాకిషన్ రావులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. ఇంటలిజెన్స్, టాస్క్ ఫోర్స్ లలో రిటైర్డ్ అధికారులను నియమించి తమను రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ ఆరోపించిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయమే ట్రాన్స్ కో, జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న కెవి. రమణాచారి కూడ తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం మధ్యాహ్నం ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా సమర్పించారు.ఇదిలా ఉంటే పలువురు కార్పోరేషన్ల చైర్మెన్లు కూడ రాజీనామాలు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News