Monday, December 23, 2024

గాజాపై భద్రత మండలిలో అమెరికా

- Advertisement -
- Advertisement -

ఐక్యరాజ్య సమితి: గాజాలోకి ఆహారం, ఇంధనం, మందులు లాంటి మానవతా సహాయం ఎలాంటి అడ్డంకులూ లేకుండా ప్రవేశించడానికి వీలుగా మానవతా దృష్టితో కాల్పుల విరమణను పాటించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో బుధవారం అమెరికా నేతృత్వంలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంపై మండలి శాశ్వత సభ్య దేశాలయిన రష్యా, చైనాలు వీటో చేశాయి.15 దేశాలు సభ్యులుగా ఉండే మండలిలో తీర్మానం ఆమోదానికి అవసరమైన మద్దతు లభించినప్పటికీ ఈ రెండు దేశాల వీటో కారణంగా అది వీగిపోయింది. తీర్మానానికి మద్దతుగా పది ఓట్లు రాగా బ్రెజిల్, మొజాంబిక్‌లు ఓటింగ్‌కు గైరు హాజరయ్యాయి. చైనా, రష్యాలతో పాటుగా యుఎఇ సైతం తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేపింది. తీర్మానంపై ఓటింగ్‌కు ముందు ఐరాసలో అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ మాట్లాడుతూ తీర్మానంపై ఏకాభిప్రాయం సాధించడానికి అమెరికా ప్రభుత్వం ప్రయత్నించినట్లు చెప్పారు.

అయినా తీర్మానాన్ని రష్యా, చైనాలు వీటో చేయడంపై ఓటింగ్ తర్వాత ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత మండలి రష్యా ప్రవేశపెట్టిన ఇదే తరహా ముసాయిదా తీర్మానంపైనా ఓటింగ్ చేపట్టింది. అయితే తీర్మానం అమోదం పొందడానికి అవసరమైన మద్దతు పొందలేకపోవడంతో అది వీగిపోయింది. కేవలం నాలుగు దేశాలు చైనా, గబన్, రష్యా, యుఎఇలు మాత్రమే తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా అమెరికా, బ్రిటన్‌లో వీటో చేశాయి. మరో తొమ్మిది దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. గత వారం రోజుల్లో భద్రతా మండలి గాజాపై తీర్మానాన్ని ఆమోదించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం ఇది నాలుగో సారి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News