Monday, December 23, 2024

ఓటు దరఖాస్తులను పరిష్కరించండి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : జిల్లాలో ఓటరు జాబితా కు సంబంధించి, దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ అన్నారు. సోమవారం ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఆర్వోలు, తహసీల్దార్లు, బూత్ స్థాయి సూపర్వైజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఫారం-6 కు సంబంధించి ఇప్పటి వరకు 14586 దరఖాస్తులు రాగా, 10990 దరఖాస్తుల పరిష్కారం అయినట్లు, మిగులు దరఖాస్తుల పరిష్కారం మంగళవారంలోగా పూర్తి చేయాలన్నారు. ఫారం-7కు సంబంధించి 1329 దరఖాస్తులు వచ్చినట్లు, 641 దరఖాస్తుల పరిష్కారం జరిగినట్లు, మిగులు పెండింగ్ దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసి, త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఫారం-8కు సంబంధించి 15975 దరఖాస్తులు అందగా, 8310 దరఖాస్తుల పరిష్కారం కాగా, 7665 దరఖాస్తులు పెండింగ్ ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఎక్కువ దరఖాస్తుల పెండింగ్ ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, త్వరితగతిన పరిష్కారం చేయాలన్నారు. బూత్ లెవల్ అధికారులచే డోర్ టు డోర్ వెరిఫికేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని, సేకరించాల్సిన విషయాలపై వారికి పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్త, కలెక్టరేట్ ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ రాంబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News