Friday, November 22, 2024

మాటల్లో స్త్రీల పట్ల గౌరవం.. కాని రేపిస్టులకు మద్దతు

- Advertisement -
- Advertisement -

Respect for women in words.. but support for rapists

ప్రధానిపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఎర్రకోటపై నుంచి మహిళల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ ఉపన్యాసాలు ఇస్తున్న వారు నిజానికి రేపిస్టులకు మద్దతు తెలుపుతున్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు సంధించారు. బల్కీస్ బానో సామూహిక అత్యాచారం కేసులో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించడంపై కేంద్రం నుంచి అనుమతి పొందుతూ తగిన ఉత్తర్వులు పొందామంటూ సోమవారం సుప్రీంకోర్టుకు గుజరాత్ ప్రభుత్వం విన్నవించిన నేపథ్యంలో రాహుల్ కేంద్రంపైన, ప్రధాని మోడీపైన ధ్వజమెత్తారు. ప్రధాని వాగ్దానాలకు, ఉద్దేశాలకు మధ్య తేడా స్పష్టమైపోయిందని, ప్రధాని మహిళలకు ద్రోహం చేశారని రాహుల్ మంగళవారం ట్వీట్ చేశారు. బిల్కీస్ బానో సామూహిక అత్యాచారం కేసులో యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్న 11 మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదిస్తూ విడుదల చేయడాన్ని సిపిఎం నాయకురాలు సుభాషిని అలీ, స్వతంత్ర జర్నలిస్టు రేవతీ లాల్, లక్నో యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ రూప్ రేఖా వర్మ ప్రజా ప్రయోజనం వ్యాజ్యం ద్వారా సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News