Wednesday, January 22, 2025

పతిపక్షాలను గౌరవించడం ప్రజాస్వామికం

- Advertisement -
- Advertisement -

పతిపక్షాలను గౌరవించడం ప్రజాస్వామికం
మోడీకి రాజస్థాన్ సిఎం చురకలు
జైపూర్: ‘ప్రధాని మోడీ.. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను గౌరవించడం అవసరం. మరి మీరు ఈ విషయంలో కాస్తానైనా స్పందిస్తారా? ప్రతిపక్షాలను గౌరవించే విధంగా వ్యవహరిస్తారా?’ అని రాజస్థాన్ సిఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లోట్ తన పక్కనున్న మోడీని నిలదీశారు. ప్రధాని మోడీ సమక్షంలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభించిన దశలో ఏర్పాటయిన ఓ వేదికపై బుధవారం గెహ్లోట్ ప్రసంగించారు. అధికారంలో ఉన్న వారు విపక్షాలను ఆదరించడం నేర్చుకుంటే పొయ్యేది ఏమీ ఉండదు. పైగా దేశానికి మరింత శక్తితో సేవలు అందించవచ్చునని సిఎం హితవు పలికారు. ప్రజలకు సంబంధించిన అంశాలలో విపక్షం స్వపక్షం పద్ధతులు పాటిస్తూ ఉంటే ఇక జనం ఏ పక్షం అవుతుందన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ స్పందించి పిఎం ఈ దిశలో ముందుకు కదులుతారని తాను ఆశిస్తున్నట్లు చెప్పినప్పుడు మోడీ మరో వైపు దృష్టి సారించారు.

మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు దేశం కోసం తమ ప్రా ణాలు వదిలారని, పార్టీలకోసం పాకులాడటం సరే దేశం కోసం ఏమి చేస్తున్నామనేదే కీలకం అవుతుందన్నారు. మన మంతా కలిసికట్టుగా ఉంటే దేశం సంఘటితంగా ఉంటుంది, మరింత ముందుకు వెళ్లుతుందన్నారు. రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలో రూ 5500 కోట్ల విలువైన వివిధ పనులను ప్రారంభించన దశలో ప్రధాని మాట్లాడుతూ ఓట్ల కోసం పనులు, పథకాలు చేపట్టే వారు దేశం కోసం ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. ప్రతికూల ఆలోచనలున్న వారి వల్ల దేశానికి నష్టం జరుగుతోందని, దేశానికి ఎటువంటి మంచి జరిగినా కొందరు చూడలేని స్థితికి చేరుకుంటున్నారని చెప్పిన ప్రధాని, అంతర్గత కుమ్ములాటల రాజస్థాన్ కాంగ్రెస్ ద్వారా ప్రజలకు ఎటువంటి సత్ఫలితాలు అందుతాయని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News