Monday, December 23, 2024

తప్పుగా ప్రవర్తించినప్పుడు వేగంగా స్పందించాలి: అదా శర్మ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సినిమాల్లో నటిస్తున్నప్పుడు త్వరగా ఎలా స్పందిస్తామో, ఎవరైనా మనతో తప్పుగా ప్రవర్తించినప్పుడు ఏం చేయాలనేదానిపై వేగంగా దృష్టి సారించాలని అదా శర్మ తెలిపారు. పక్కవారి అభిప్రాయాలను అసలు తీసుకోకూడదన్నారు. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై అదా శర్మ స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతుండగా మీరు ఎప్పుడైనా క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తాను నేల మీదనే కూర్చున్నానని, సోఫాలో(కౌచ్) కూర్చోవాలని అనుకోవడంలేదన్నారు. మద్దతు ఇచ్చేవారు మనకు కలిగి ఉండాలని, సినీ ఇండస్ట్రీలో చాలా మంది తనకు సపోర్ట్ చేశారని, అందుకే సంతోషంగా ఉన్నానని వివరించారు. ఇబ్బందకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా ముందడుగు వేశానని ఆమె తెలియజేశారు. ‘హార్ట్ ఎటాక్’ సినిమాలో అదా నటించి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘కల్కి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘గరం’ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ‘కేరళ స్టోరీ’ అనే మూవీలో నటించి దేశ వ్యాప్తంగా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నటిస్తున్న ‘ది గేమ్ ఆఫ్ గిర్గిత్’ అనే సినిమా అతి త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News