Friday, December 20, 2024

ఓయూలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు స్పందన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ కు భారీ స్పందన లభించింది. ఓయూ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్ మెంట్ సెంటర్ లో టుటరూట్ సంస్థ ఏర్పాటు చేసిన ఈ డ్రైవ్ లో మానవవనరుల అధికారులు విద్యార్థులకు లిఖిత, మౌఖిక పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్ లోని ఆయా కళాశాలలకు చెందిన 40 విద్యార్థులు హాజరయ్యారు.

టుటరూట్ సంస్థ అధికారులు సంస్థ విధి విధానాలను తొలుత విద్యార్థులకు వివరించారు. అర్హత సాధించి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా త్వరలోనే విడుదల చేసి ఉద్యోగ నియామక ధృవపత్రాలు అందిస్తామని సంస్థ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియామక సంస్థ ప్రతినిధులతో పాటు హెచ్.సి.డి.సి డైరెక్టర్ ప్రొఫెసర్ స్టీవెన్ సన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News