Saturday, April 19, 2025

రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత: మందుల సామేల్

- Advertisement -
- Advertisement -

17మన తెలంగాణ/మోత్కూరు: భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. మోత్కూరు మండలంలోని పాలడుగు, దత్తప్పగూడెం గ్రామాల్లో జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీని నిర్వహించారు. జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ మండల కోఆర్డినేటర్ సుంకిశాల అనిల్ ఆద్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈసంధర్భంగా పాలడుగు లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను భారత రాజ్యాంగాన్ని కారాస్తూ ప్రజలకు కావాల్సిన సమాన హక్కులను స్వేచ్చలను అవమానపరుస్తూ పాలనసాగిస్తుందన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకొనే బాధ్యత అందరిపై ఉందన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడాలనే దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ అనుసరించిన అహింస,శాంతి సిద్దాంతాలను అస్త్రాలుగా చేసుకొని రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ను వివరిస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ ముందుకుసాగుతుందని మందు సామేల్ వివరించారు.

ఈకార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు డాక్టర్ జి.లక్ష్మీనర్సింహ్మారెడ్డి, సింగిల్విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, మార్కెట్ డైరెక్టర్ పన్నాల శ్రీనివాస్‌రెడ్డి, కొంపెల్లి లలిత, మాజీ సర్పంచ్‌లు మర్రిపెల్లి యాదయ్య, మర్రిపె ముక్కంల వీరయ్య, సుదగాని పాండు, మాజీ ఎంపీటీసీలు అంతటి నర్సయ్య, ఆకవరం లక్ష్మణాచారి, మాజీ ఉపసర్పంచ్ ఎడ్ల భగవంతు, మండల నాయకులు రాచకొండ బాలరాజు, బద్దం యాదిరెడ్డి, గంగమల్లు, సత్తిరెడ్డి, సైదులు, నర్సింహ్మ,గోరయ్య, మహేష్, గుండు యాదగిరి, నరేష్, రవి, మత్యగిరి, సతీష్, భిక్షపతి, సోమయ్య, పెద్ద భిక్షం తదితరులు పాల్గొన్నారు.

responsibility to protect Constitution

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News