9మంది రిటైర్డ్ స్పెషల్ ఆఫీసర్ల తిష్ఠ పని లేకున్నా లక్షల్లో జీతాలు
ప్రైవేట్ సైన్యానికి నాయకుడిగా ఓ వ్యక్తి చలామణి నిధులు లేవంటూనే వృథా వ్యయాలు
మన తెలంగాణ/పంజాగుట్ట : నిమ్స్ ఆసుపత్రి.. దేశంలోనే ప్రసిద్ధి గాంచిన నిరుపేదల కార్పొరేట్ ఆసుపత్రి. అలాంటి ఆసుపత్రిలో వందలాది మం ది వైద్యులు, ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. ఎంతో చురుకైన అధికారులు ఉన్నారు. పరిపాలన విభాగంలో అనుభవం ఉన్న ఉద్యోగులు కూ డా ఎంతో మంది పని చేస్తున్నారు. వీరందరినీ కాదని నిమ్స్ ఆసుపత్రికి మాత్రం రిటైర్డ్ ఉద్యోగుల అవసరం పడింది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిది మంది రిటైర్డ్ ఉద్యోగులని స్పెషల్ ఆఫీసర్లుగా నియమించుకొని రూ. లక్షల్లో జీతాలు చెల్లిస్తూ నిమ్స్ సొమ్ముని అప్పనంగా ముట్టచెబుతున్నారు. వివిధ రకాల పో స్టు లు సృష్టించి ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేశా రు.
పోనియ్ వారు ఏమన్నా నిమ్స్‌కు సేవలు అందిస్తున్నారా..అంటే అందులో సగం మంది సాయంత్రం నిమ్స్‌కి వచ్చి ఒక టీ తాగి, పిచ్చాపా టి ముచ్చట్లు చెప్పుకొని ఇంటికి వెళ్తున్నారు. మ రో ఇద్దరు ముగ్గురు కేవలం పైరవీలకు మాత్రమే పరిమితం. ఇక వీరందరిని తీసుకువచ్చి నియమించిన ఒక రిటైర్డ్ ఉద్యోగి ‘నబీ’తో న భవిష్యత్ అన్నట్లుగా రూ.లక్షల జీతం అప్పనంగా కొట్టేస్తున్నాడు. ఇతనికి రూల్స్‌కు విరుద్ధంగా రూ.లక్షకు పైగా జీతం చెల్లిస్తున్నారు. ఈయన నిమ్స్‌కు చేస్తున్న సేవలేంటంటే ఏమీ లేవు. ఏడాదిన్నరగా లక్షల జీతం తీసుకుంటూనే ఉన్నాడు. ఇతను కేవలం పైరవీలతోనే కాలం వెళ్లదీస్తున్నాడు తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని నిమ్స్‌లోని ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు.
నిమ్స్ చరిత్రలోనే మొదటిసారిగా
నిమ్స్ చరిత్రలో ఇంత మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించుకున్న దాఖాలాలు లేవు. ఉన్న సమాచారం మేరకు గతంలో రాజకీయ నేతల ప్రమేయంతో ఒక్కరినో..ఇద్దరినో నియమించుకున్నారే తప్ప అంతకి మించి అదనపు అధికారులు ఎవ్వ రూ లేదు. కానీ ఏడాదిన్నరగా ఏకంగా తొమ్మిది మంది బయట వ్యక్తులను ఉద్యోగులుగా నియమించుకోవడం వెనుకఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని కొందరు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.
చక్రం తిప్పుతున్న రిటైర్డు ఉద్యోగి
ఈ ప్రైవేట్ సైన్యానికి నాయకత్వం వహిస్తున్న ఒక రిటైర్డ్ ఉద్యోగి నిమ్స్‌లో చక్రం తిప్పుతున్నట్టు సమాచారం. నిమ్స్ ఉన్నతాధికారి అయన చెప్పిన చోట సంతకం చేయడం, చెప్పిన ఫైల్ మూవ్ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. నిమ్స్ ‘లక్ష్మీ పుత్రుడు’ ఒకరు ఈ రిటైర్డ్ ఉద్యోగితో చేతులు కలిపి ‘నభూతో న భవిష్యత్తు’ అన్నట్టు అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. టెండర్ నిబంధనలలో మార్పులు, కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాలు, ఉద్యోగ నియామకాల్లో చురుకైన పాత్ర వహిస్తూ దండుకుంటున్నారని సమాచారం. ఇక ఈ తొమ్మిది మందిలో ఇద్దరు స్పెషలాఫీసర్లు మాత్రం నిమ్స్ మాజీ ఉద్యోగులు ఉన్నారని, వీరి వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుందే తప్ప..మిగతా ఏడుగురికి నిమ్స్‌కు జీతాలు వృథా తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని నిమ్స్‌లోని ఓ అధికారే వ్యాఖ్యానించడం గమనార్హం.
ప్రభుత్వం దృష్టిసారించేనా
ఇక ముఖ్య విషయం ఏంటంటే..ఇటీవల ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ రిటైర్డ్ ఉద్యోగులను వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. వృథా వ్యయాలను అరికట్టడంలో భాగంగా ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో కాం ట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులని తొలగించాలని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ కూడా నిమ్స్‌కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. నిమ్స్ యాజమాన్యం తా త్సా రం చేస్తోందని విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ తొమ్మిది మందిలో కొందరు తమ అనుకూలు పోస్టులు కొనసాగించేలా ప్రైవేట్ సైన్యం నాయకుడు పైరవీలు మొదలు పెట్టారని తెలిసింది.