Wednesday, January 22, 2025

షేన్ వార్న్ హఠాన్మరణం…దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కెటిఆర్, శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

Rest in Peace Shane warne said by KTR Srinivas goud

హైదరాబాద్: క్రికెట్ దిగ్గజం, స్పిన్ మాంత్రికుడు, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ (52) హఠాన్మరణం పట్ల రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ (52) గుండెపోటుతో కన్నుమూశారు. గొప్ప లెగ్ స్పినర్ గా వార్న్ రాణించారని కెటిఆర్ కొనియాడారు. షేన్ వార్న్ మృతిపట్ల కెటిఆర్, శ్రీనివాస్ గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు.  యావత్ క్రికెట్ ప్రపంచానికి తీరని లోటు అని  శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఎంతో మంది వర్ధమాన క్రికెట్ క్రీడాకారులకు స్ఫూర్తి గా నిలిచారన్నారు. స్పిన్ బౌలర్ గా ప్రపంచ క్రికెట్ లో ఆస్ట్రేలియా జట్టు కు ఎన్నో స్ఫూర్తివంతమైన విజయాలను అందించారన్నారు. క్రికెట్ కు షేన్ వార్న్ చేసిన సేవలను స్మరించుకున్నారు. వార్న్ తన క్రీడా జీవితంలో 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశారు. టెస్టుల్లో 5 వికెట్లు 37సార్లు, 10 వికెట్లు పదిసార్లు తీసిన అనితర సాధ్యుడుగా నిలిచారని శ్రీనివాస్ గౌడ్ ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News