ఆదేశాలు జారీ చేసిన రైల్వేశాఖ
హైదరాబాద్: భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడతుండటంతో ఒక్కొక్కటిగా ఆంక్షలను రైల్వేశాఖ ఎత్తివేస్తోంది. ప్రస్తుతం రైలు ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని అన్ని రైళ్లలో ఆహారం అందించే సేవలను రైల్వేశాఖ పునరుద్ధరించింది. లాక్‌డౌన్ సడలించిన తర్వాత దశల వారీగా రైళ్లను పునరుద్దరించిన రైల్వే శాఖ ఈ సేవలను పునఃప్రారంభిస్తున్నట్టు తెలిపింది. రైళ్లలో ఆహారం సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఐఆర్‌సిటిసి, జోన్ల కమర్షియల్ మేనేజర్లను, రైల్వే బోర్డును ఇప్పటికే రైల్వేశాఖ ఆదేశించింది. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని రైళ్లలో ఈ ఆహార సేవలను పునరుద్ధరిస్తున్నట్లు రైల్వే శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. రాజధాని, శతాబ్ది, వందే భారత్, తేజస్, గతిమాన్ రైళ్లలో ఈ ఆహార సరఫరా సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. కోవిడ్ తగ్గుముఖం పట్టిన దృష్ట్యా ఆహార సేవలు పునఃప్రారంభిస్తున్న రైల్వే శాఖ వెల్లడించింది.