Wednesday, January 22, 2025

హెచ్‌ఐవి మాత్రతో వృద్ధుల్లో తిరిగి జ్ఞాపక శక్తి

- Advertisement -
- Advertisement -

Restoration of memory in the elderly with the HIV pill

 

లాస్‌ఏంజెల్స్ : హెచ్‌ఐవి చికిత్సకు ఉపయోగించే తొమ్మిది డాలర్ల విలువైన మాత్ర నడి వయస్సులు, వృద్ధుల్లో కోల్పోయిన జ్ఞాపకశక్తిని తిరిగి రప్పించగలుగుతుందని కాలిఫోర్నియా, లాస్‌ఏంజెల్స్ యూనివర్శిటీల శాస్త్రవేత్తలు వెల్లడించారు. సెల్జెంట్రీ అనే బ్రాండ్ పేరుపై విక్రయించే మారవిరక్ అనే ఔషధం నడివయస్సు లోని జంతువుల్లో జ్ఞాపకశక్తిని పెంపొందించిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మనుషుల్లో ఇదెంతవరకు జ్ఞాపకశక్తిని పటిష్టపరుస్తుందో లేదా డెమెన్షియా ప్రారంభ దశలో రోగుల్లో కోల్పోతున్న జ్ఞాపకశక్తిని తిరిగి ఎలా రప్పించగలుగుతుందో ప్రయోగాలు చేపడితే కానీ తెలియదని శాస్త్రవేత్తలు వివరించారు. హెచ్‌ఐవి వ్యాపించడానికి ఉపయోగపడే కణం జన్యువును ఈ ఔషధం మార్చ గలుగుతుంది. కానీ అదే జన్యువు అవసరం లేని జ్ఞాపక కణాలను త్రుంచి పారేస్తుంది. ఫలితంగా జ్ఞాపకశక్తి పెంపొందడానికి దోహదపడుతుంది. జ్ఞాపకశక్తిని కోల్పోవడాన్ని డెమెన్షియా వ్యాధిగా పరిగణిస్తారు.

ఐదు మిలియన్ల కన్నా ఎక్కువ మంది అమెరికన్లు డెమెన్షియాతో బాధపడుతున్నారు. దీన్ని పూర్తిగా నిర్మూలించగల ఔషధం సరైనదేదీ ఇప్పుడు అందుబాటులో లేదు. ఈ వ్యాధిని నెమ్మదింప చేయడానికి పరిమితంగా చికిత్సలు ఉంటున్నాయి. పరిశోధకులు తాము ఎలుకలపై చేసిన ప్రయోగాల వివరాలను జర్నల్ నేచర్‌లో వెలువరించారు. సిసిఆర్ 5 అనే జన్యువు ఎలుకల్లో అతిగా ఉత్తేజితం అయినప్పుడు అవి జ్ఞాపకశక్తిని కోల్పోతున్నాయని, రెండు రకాల బోన్ల తేడాను గుర్తించ లేక పోతున్నాయని పరిశోధకులు గ్రహించారు. ఆ జన్యువును తొలగిస్తే అవి అన్నిటినీ చక్కగా గుర్తుంచుకోగలుగుతున్నాయి. మెదడులోని కణాల అనుసంధానం కూడా బాగా ఉంటోందని పరిశోధకులు తెలుసుకున్నారు. ఇప్పుడు మారవిరక్ ఔషధంతో ప్రయోగాలు మనుషులపై చేయడానికి సిద్ధమౌతున్నట్టు పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ ఆల్సినో సిల్వా చెప్పారు. జ్ఞాపక శక్తి ఏ విధంగా నశిస్తుందో పూర్తిగా తెలుసుకుంటే ఆ ప్రక్రియను చాలా నెమ్మది చేసే శక్తి వస్తుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News