Friday, November 22, 2024

భద్రాచలం వంతెనపై రాకపోకలు పునరుద్ధరణ

- Advertisement -
- Advertisement -

తగ్గుముఖం పట్టిన గోదావరి
59.40 అడుగులకు
నీటిమట్టం కొనసాగుతున్న
మూడో ప్రమాద హెచ్చరిక
వార్ రూం ఏర్పాటు
హెల్ప్‌లైన్ నెంబర్లు
90302 27324,
040-24651119

జిల్లా కలెక్టర్ అనుదీప్ వెల్లడి
మన తెలంగాణ/భద్రాచలం : వరద తీవ్రత దృష్టా రెండు రోజులపాటు భద్రాద్రి వంతెనపై విధించిన నిషేధాజ్ఞలను తిరిగి పునరుద్ధరించారు. భద్రాద్రి వద్ద సుమారు 72అడుగుల మేర నీటి మట్టం రావడంతో వంతెన పై నుంచి ఎటువంటి వాహనాలు ప్రయాణించకుండా రాకపోకలు నిలిపివేశారు. కాగా, వర ద నీటి మట్టం ఆదివారం రాత్రికి 59.4 అడుగుల దిగువకు పడిపోవడంతో ఆదివారం రా త్రి 7 గంటల నుంచి తిరిగి రాకపోకలకు అవకాశం కల్పిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశా రు. భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా విధించిన 144 సెక్షన్ కూడా ఉపసంహరించారు. వంతెనపై రాకపోకలు నిషేధించడం కారణంగా మూడు రాష్ట్రాలకు చెందిన వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. తాజాగా కలెక్టర్ నిర్ణయంతో ఈ రాత్రి నుంచి వాహన రాకపోకలకు అవకా శం ఏర్పడింది. కాగా, గోదావరి మూడవ ప్ర మాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్నదని, సా ధారణ పరిస్థితులు నెలకొనే వరకు ప్రజలు అ ప్రమత్తంగా ఉండాలని సూచించారు. గో దావరితో పాటు జలాశయాల వద్ద ప్రజలు ఫో టోలు, సెల్ఫీలు దిగడం నిషేధమని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News