Wednesday, November 13, 2024

సీనియర్ సిటిజన్లకు రాయితీని పునరుద్ధరించండి

- Advertisement -
- Advertisement -

Restore concession to senior citizens

రైల్వేకు స్టాండింగ్ కమిటీ సిఫారసు

న్యూఢిల్లీ : రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీని పునరుద్ధరించాలని పార్లమెంటరీ కమిటీ రైల్వే మంత్రిత్వశాఖకు సిఫారసు చేసింది. కనీసం స్లీపర్ , థర్డ్ ఏసీ కోచ్‌ల్లోనైనా వెంటనే పునరుద్ధరించాలని సూచించింది. రైల్వే మంత్రిత్వశాఖ స్టాండింగ్ కమిటీ ఈనెల 4 న రైల్వేకు తన నివేదికను సమర్పించింది. గతంలొ సీనియర్ సిటిజన్లకు రైలు ఛార్జీల్లో 40 నుంచి 50 శాతం వరకు రాయితీ ఇవ్వగా, కొవిడ్ మహమ్మారి సమయం నుంచి దాన్ని నిలిపివేశారు. రైల్వేలు ప్రస్తుతం సాధారణ స్థితి లోకి వెళ్తున్నందున వివిధ వర్గాల ప్రయాణికులకు ఇచ్చే రాయితీలకు సంబంధించి ఛార్జీల్లో రాయితీపై సమీక్షించాలని , కనీసం స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ కోచ్‌ల్లోనైనా వెంటనే పునరుద్ధరించాలని ఎంపీ రాధామోహన్ సింగ్ నేతృత్వం లోని కమిటీ తన సిఫార్సుల్లో పేర్కొంది. దీనివల్ల నిరుపేద వృద్ధులు రైల్వే సేవలను సద్వినియోగం చేసుకునే వీలుంటుందని తెలిపింది. అయితే ఈ రాయితీ కారణంగా ఏటా దాదాపు రూ. 2 వేల కోట్ల నష్టం వాటిల్లుతోందని రైల్వే చెబుతోంది. మరోవైపు గివ్ అప్ పథకానికి విస్తృత ప్రచారం కల్పించాలని రైల్వే మంత్రిత్వశాఖను కమిటీ కోరింది. ఈ పథకంలో రాయితీని స్వచ్ఛందంగా వదులుకునేలా ప్రోత్సహించాలని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News