Friday, November 22, 2024

రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

145 నిమిషాలపాటు విమానాశ్రయం మూసివేత

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జనవరి 26 గణతంత్ర దినోత్సవం వరకు ఉదయం 10.20 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు విమానాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు శుక్రవారం ఉదయం జారీ,చేసిన నోటమ్(నోటీసు టు ఎయిర్‌మెన్)లో ప్రభుత్వం తెలిపింది. గణతంత్ర దినోత్సవం వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని, ఇవే ఆంక్షలు జనవరి 29న ఢిల్లీలోని వజయ్ చౌక్‌లో బీటింగ్ రిట్రీట్ సెర్మనీ సందర్భంగా కూడా ఉంటాయ ఒక వార్తాసంస్థ తెలిపింది.

జనవరి 26న ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు ఢిల్లీ విమానాశ్రయం మూతపడుతుందని, ఏ విమానాలు టేకాఫ్ కావని కూడా ఆ వార్తాసంస్థ తెలిపింది. అయితే గవర్నర్లు లేదా ముఖ్యమంత్రులతో ప్రయాణించే వైఆనిక దళం, సరిహద్దు భద్రతా దళం, కేంద్ర ప్రభుత్వ ఆధర్వంలో నడిచే విమానాలు లేదా హెలికాప్టర్లకు నోటమ్ వర్తించదు. ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటైన ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గనణతంత్ర దినోత్సవానికి ముందు భద్రతాపరమైన ఆంక్షలు విధించడం ప్రతి ఏటా జరిగే ఆనవాయితీయే.

కాగా..దట్టమైన పొగ మంచు కారణంగా గత కొద్ది రోజులుగా వామానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చేవారం ప్రతిరోజు 145 నిమిషాలపాటు మూతపడడం వల్ల వాణిజ్య విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. భారతదేశం తన 75వ గణతంత్ర దినోత్సవాన్ని వచ్చే వారం జరుపుకోనున్నది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రాన్ ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరుకవాడం ఇది ఆరవసారి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీ పోలీసులు భద్రతాపరంగా అనేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 15 వరకు పారాగైడర్లు, ఇతర ఆకాశంలో ఎగిరే పరికరాల వాడకంపై నిషేధం విధించారు. హాట్ ఎయిర్ బెలూన్లు, రిమోట్‌తో నడిపే డ్రోన్లు, చిన్న విమానాలు, మైక్రోలైట్ విమానాలు, హ్యాంగ్ గ్లైడర్లు వంటివి ఇందులో ఉన్నాయి. పారా జంపింగ్, పారచ్యూటింగ్‌ను కూడా నిషేధించారు. ఢిల్లీ పోలీసులకు చెందిన తూర్పు జిల్లా డివిజన్ శుక్రవారం అక్షర్‌ధామ్ ఆలయం వద్ద మాక్ టెర్రరిస్టు డ్రిల్‌ను నిర్వహించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News