Sunday, December 22, 2024

ఆర్‌ఓ కేంద్రాల వద్ద ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

ఈ నెల 3వ తేదీ నుంచి నామినేషన్లు ప్రారంభం
144 సెక్షన్ విధిస్తూ సైబరాబాద్ సిపి ఆదేశాలు

మనతెలంగాణ, సిటిబ్యూరోః  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల నామిషనేన్లు ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ ఆఫీసర్ల కార్యాలయ పరిసరాల్లో 144 సెక్షన్ విధిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాజేంద్రనగర్ ఆర్‌డిఓ ఆఫీస్, శేరిలింగపల్లి జిహెచ్‌ఎంసి జోనల్ ఆఫీస్, చేవెళ్ల ఆర్‌డిఓ ఆఫీస్, షాద్‌నగర్ ఆర్‌డిఓ ఆఫీస్, కుత్బుల్లాపూర్ డిసి సర్కిల్ ఆఫీస్, కూకట్‌పల్లి డిసి మూసాపేట్ సర్కిల్ జిహెచ్‌ఎంసి ఆఫీస్‌లో ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది.

ఈ కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ విధించారు, ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది ఒకేచోట గుమికూడవద్దని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ కమిషనర స్టిఫెన్ రవీంద్ర హెచ్చరించారు. ఆంక్షలు ఈ నెల 3వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 15వ తేదీ వరకు అమలులో ఉండనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News