Monday, January 20, 2025

టిఎస్‌పిఎస్‌సి పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ, హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 7వ తేదీని పరీక్ష కేంద్రాలకు 500 మీటర్ల దూరంలో ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడడం నిషేధించారు. ఆంక్షలు ఉదయం 6 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 6గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు. ఆంక్షల నుంచి పోలీస్ అధికారులు, మిలటరీ అధికారులు, హోంగార్డులు,ఫ్లైయింగ్ స్క్వాడ్, అంత్యక్రియలు నిర్వహించేవారికి మినహాయింపు ఉంటుందని తెలిపారు. ఆంక్షలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News