Monday, December 23, 2024

సైబరాబాద్ పరిధిలో ఆంక్షలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆంక్షలు విధిస్తూ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్, ఎస్‌ఎస్‌సి పరీక్ష కేంద్రాల నుంచి 200 మీటర్ల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ కేంద్రాలకు సమీపంలో ఐదుగురు కంటే ఎక్కువగా గుమి కూడవద్దని ఆదేశించారు. పరీక్షలు ఈ నెల 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పోలీస్ ఆఫీసర్లు, మిలటరీ పర్సన్లు, హోంగార్డులు, ఫ్లైయింగ్ స్కాడ్ ఎడ్యూకేషన్ డిపార్ట్‌మెంట్, బోనాఫైడ్ ఫ్యూనరల్ ప్రాసెస్‌కు మినహాయింపు ఉందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News