కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా సైబరాబాద్ పరిధిలో ఆంక్షలు విధించినట్లు సీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా నూతన సంవత్సర వేడుకలు చేసుకోవాలని సూచించారు. ర్యాష్ డ్రైవింగ్‌తో ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దు.. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. పైవంతెనలు, ఓఆర్ఆర్, పివి ఎక్స్ ప్రెస్ వేలను మూసివేస్తున్నట్లు తెలిపారు.
ఓఆర్ఆర్ నుంచి విమానాశ్రయానికి వెళ్లే వారికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. డ్రగ్స్ సేవించే వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. డ్రగ్స్ తీసుకుని పట్టుబడితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ విషయంలో పబ్ ల యాజమాన్యానిదే బాధ్యతని చెప్పారు. పబ్ లు, హోటల్స్ వద్ద సీసీ కెమెరాలతో నిఘా పెట్టినట్లు చెప్పారు. రాత్రి 8 నుంచి ట్రాఫిక్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు.