హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలపై ఆంక్షలు విధించారు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనాలకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలను జిహెచ్‌ఎంసి, హైదరాబాద్ పోలీసులు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిమజ్జనాలకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ట్యాంక్‌బండ్ మార్గంలో ఫ్లెక్సీలతో పాటు భారీగా ఇనుప కంచెలను కూడా జిహెచ్‌ఎంసి సిబ్బంది ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్‌లో పివొపి విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చిన విషయం విధితమే. హైకోర్టు ఆదేశాలు అమలు చేయడంలేదని లాయర్ వేణుమాదవ్ పిటిషన్ వేశారు. హుస్సేన్ సాగర్ పరిరక్షణ బాధ్యతలను హైడ్రా చేపడుతుందని పిటిషనర్ కోర్టుకు వివరించారు. హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి సంవత్సరం నలుమూలల నుంచి హుస్సేన్‌సాగర్‌లో భారీగా వినాయకులను నిమజ్జనం చేస్తున్న విషయం తెలిసిందే.
హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలపై ఆంక్షలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -