Friday, January 24, 2025

న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

31వతేదీ రాత్రి 1గంట వరకే వేడుకలకు అనుమతి
సామర్థానికి మించి పాస్‌లు ఇవ్వవద్దు

మన తెలంగాణ, సిటీ బ్యూరోః నగరంలోని ఈ నెల 31వ తేదీన నిర్వహించే కొత్త సంవత్సర వేడుకలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 31వ తేదీన రాత్రి ఒంటి గంట వరకే కొత్త ఏడాది వేడుకలు నిర్వహించుకోవాలని ఆదేశించారు. సామర్థానికి మించి పాసులు ఇవ్వవద్దని ఈవెంట్ నిర్వాహకులకు సూచించారు.

ఎక్కువగా ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈవెంట్ నిర్వాహకులు పది రోజుల మందుగానే పోలీసుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. కొత్త ఏడాది సందర్భంగా వేడుకలను రాత్రి ఒంటి గంట వరకే ముగించాలని తెలిపారు. ప్రతీ ఈవెంట్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొత్త సంవత్సర వేడుకల్లో నిర్వాహకులు సెక్యూరిటీ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, ఎలాంటి సంఘటనలు జరిగినా వారిదే బాధ్యతతని అన్నారు. కొత్త సంవత్సర వేడుకల్లో అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని తెలిపారు.

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పార్టీల్లో 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం ఉండకూడదని తెలిపారు. వాహనాల పార్కింగ్‌లో ఇబ్బందులు లేకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. పార్టీలకు వచ్చే వారు సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య కలిగించవద్దని అన్నారు. లిక్కర్ సంబంధిత వేడుకల్లోకి మైనర్లకు అనుమతి లేదని, న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ ఉపయోగిస్తే కఠిన చర్యలు ఉంటామని హెచ్చరించారు. సమయం మించిన తర్వాత మద్యం సరఫరా చేయవద్దని, అలా చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

మద్యం తాగి డ్రైవింగ్ చేయవద్దు…
మద్యం తాగి డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్‌డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. మద్యం తాగిన వారికి 30 మైక్రోగ్రాముల కంటే తక్కువగాఉండాలని అన్నారు. మద్యం తాగి వాహనాలను నడిపే వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై రూ.10,000 జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని అన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలలు లేదా శాశ్వతంగా క్యాన్సిల్ చేస్తామని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వాహనాల యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News