Monday, January 27, 2025

హైదరాబాద్‌లో వాహనాలపై ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

వివిధ కేటగిరీలుగా విభజించిన పోలీసులు
94 రూట్లలో భారీ వాహనాలకు నో ఎంట్రీ

మనతెలంగాణ, సిటిబ్యూరోః హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వాహనాలను వివిధ కేటగిరీలుగా విభజించి వాటి ఎంట్రీ, ఎగ్జిట్‌కు నిర్ధేశిత సమయాలు నిర్ణయించారు. 94 రూట్లలో భారీ వాహనాల ఎంట్రీ నిషేధించారు. భారీ వాహనా, అంతరాష్ట్ర, ఇంటర్ డిస్ట్రిక్ట్ వాహనాలను ఎన్ 3, 12టన్నులు, టి4 10 టున్నుల లారీలు, టక్కులకు ఇరవై నాలుగు గంటలు నగరంలోకి ఎంటర్ కావడం నిషేధించారు. లోకల్ లారీలు, నిర్మాణ సామగ్రీ తీసుకుని వెళ్లే వాహనాలను ఎన్ 3, టి4 కేటగిరిగా ఇందులో ఎన్ 3, 12 టన్నులు, టి 4 10 టన్నులు తీసుకుని వెళ్లే వాహనాలను నగరంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతించరు.

రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతి ఉంటుంది. ఇది కూడా పోలీసులు పేర్కొన్న 64 రూట్లలో మాత్రమే అనుమతి ఉంటుంది. మీడియం గూడ్స్ వాహనాలు(డిసిఎం, ఐచర్, స్వరాజ్ మజ్‌దా) 3.5 టున్నులు, 12 టన్నులు కంటే తక్కువ, 3.5 టన్నుల కంటే ఎక్కువ, 10 టన్నుల కంటే తక్కువ వాహనాలను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నగరంలో తిరిగేందుకు అనుమతిలేదు, మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు అనుమతి ఉంది. ఈ వాహనాలను 66 రూట్లలో మాత్రమే అనుమతిస్తారు. ప్రైవేట్ బస్సులు ఎం3 కేటగిరి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలోకి అనుమతించరు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు అనుమతిస్తారు.

స్లోగా వెళ్లే వాహనాలు(చేతితో నెట్టేవి, జంతువులు లాగేవి, సైకిల్ రిక్షా, పవర్‌టిల్లర్స్, ట్రాక్టర్లు)ను 61 రూట్లలో మాత్రమే అనుమతిస్తారు. వేస్ట్‌ను తీసుకుని వెళ్లే వాహనాలు, రెండు నుంచి ఆరు టున్నుల చెత్తను తీసుకుని వెళ్లే వాహనాలు(చిన్న టిప్పర్లు) ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి లేదు, ఉదయం 11.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, రాత్రి 10 నుంచి ఉదయం 9 గంటల వరకు చిన్న టిప్పర్లు హైదరాబాద్ నగరం మొత్తం తిరగవచ్చు. పది టన్నుల అంతకు మించి చెత్తను తీసుకుని వెళ్లే వాహనాలు(భారీ వాహనాలు) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతి లేదు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News