- Advertisement -
హైదరాబాద్: పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. తొలి ప్రాధాన్యతలో ఓట్లలో బిజెపి అభ్యర్థి అంజిరెడ్డికి 75, 675 ఓట్లు పడగా ప్రస్తుతం ఆయన 5,110 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 70,565 ఓట్లు పడగా బిఎస్‌పి అభ్యర్థికి ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో మొత్తం చెల్లిన ఓట్లు 2, 23, 343గా ఉన్నాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు. పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో మొత్తం చెల్లని ఓట్లు 28,686 ఉన్నట్టు గుర్తించారు. పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో1,11,672 ఓట్లు వస్తే గెలిచే అవకాశం ఉంటుంది.
- Advertisement -