- Advertisement -
లాన్సెట్ అధ్యయనం వెల్లడి
లండన్ : భిన్న రకాల కొవిడ్ టీకా డోసులతో గట్టి ఫలితమే ఉంటుందని, దీనివల్ల బలమైన రోగ నిరోధక స్పందన కలుగుతోందని బ్రిటన్ లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం వివరాలు ది లాన్సెట్‌లో వెల్లడయ్యాయి. 1070 మందిపై ఈ పరిశోధన నిర్వహించారు. ఆస్ట్రాజెనెకా లేదా ఫైజర్ టీకాలను మొదటి డోసు కింద పొందిన వారికి రెండో డోసు కింద మోడెర్నా లేదా నోవావాక్స్ వ్యాక్సిన్లను అందచేశారు. వీరిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని, ఒకే కంపెనీ డోసులతో పోలిస్తే మిశ్రమ డోసుల వల్ల ఎక్కువ గానే యాంటీబాడీలు విడుదలైనట్టు శాస్త్రవేత్తలు చెప్పారు. రెండో డోసు కింద మోడెర్నా వ్యాక్సిన్‌ను పొందిన వారిలో స్వల్పకాల దుష్ప్రభావాలు కనిపించినట్టు వివరించారు. మరింత విస్తృతంగా టీకాలను అందుబాటు లోకి తీసుకురావడంలో ఈ వ్యూహం ఉపయోగపడుతుందని తెలిపారు.
- Advertisement -