Thursday, January 23, 2025

ఫలితాల ఆధారిత విద్యను విద్యార్థులకు అందించా: ఓయూ విసి రవీందర్‌ యాదవ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: విద్యార్థులకు ఫలితాల ఆధారిత విద్యను నిజమైన స్పూర్తితో అమలు చేయాల్సిన అవసరం ఉందని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య దండెబోయిన రవీందర్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం ఓయూలోని ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో అడ్వాన్సింగ్ ఎవాల్యుయేషన్ ప్రాక్టీసెస్, పేపర్ సెట్టింగ్ అనే అంశంపై జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులకు సరైన మూల్యాంకనం, భవిష్యత్ సవాళ్లకు సిద్ధం చేయాల్సిన అవసరాలను తెలియజేశారు. పరిశ్రమ అవసరాలకు సరిపోయే నైపుణ్యాలు విద్యార్థులకు అందటం లేదంటూ బిఎఫ్‌ఎస్‌ఐ నిర్వహించిన సర్వేను ఆయన ఊటంకించారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా బోధన, అభ్యాస ప్రక్రియల కఠినతను పెంచడానికి మూల్యాంకన వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందన్నారు.

అనంతరం జరిగిన రెండవ సెషన్లలో మధురైలోని త్యాగరాజర్ కాలేడ్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ ప్రొపెసర్ భాస్కర్ ప్రసంగిస్తూ సవరించిన బ్లూమ్స్ టాక్సానమీని ఉపయోగించి ఎఫెక్టివ్ అసెస్‌మెంట్‌ను చేసే విధానాలను వివరించారు. మూడవ సెషన్‌లో నిట్ వరంగల్‌లోని కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ బి.వి అప్పారావు (రిటైర్డ్) ‘లెర్నింగ్ అవుట్‌కమ్ బేస్డ్ అసెస్‌మెంట్’ అనే అంశంపై తన అనుభవాలను పంచుకున్నారు. నాల్గవ సెషన్‌లో ప్రొఫెసర్ సిహెచ్. సుబ్రమణ్యం, చివరి సెషన్ స్పీకర్ ప్రొఫెసర్ ఎం.ఎల్. సాయి కుమార్ (రిటైర్డ్),ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ అభినందన సందేశం అందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News