న్యూఢిల్లీ : ఢిల్లీ శాసనసభ ఎన్నికలపై చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే నిజమయ్యాయి. దేశ రాజధానిలో అధికార ఆప్‌పై బిజెపి ఆధిపత్యం సాధించింది. ఢిల్లీ శాసనసభలోని 70 సీట్లలో బిజెపి 48 సీట్లను కైవసంచేసుకోగా ఆప్ 22 సీట్లకు పరిమితం అయింది. కాంగ్రెస్ ఒక్క సీటూ గెలుచుకోలేకపోయింది. కీలక ఎగ్జిట్ పోల్స్‌లో వాస్తవ ఫలితాలకు బాగా దగ్గరగా ఉన్నవి ఏక్సిస్ మై ఇండియా అంచనాలే. బిజెపి 45 నుంచి 55 సీట్లు గెలుస్తుందని, ఆప్‌కు 15 నుంచి 25 సీట్లు రావచ్చునని ఏక్సిస్ మై ఇండియా సూచించింది. కాగా, టుడేస్ చాణక్య బిజెపికి 4557 సీట్లు, ఆప్‌కు 1325 సీట్లు సూచించింది. పీపుల్స్ ఇన్‌సైట్ ఎగ్జిట్ పోల్ బిజెపి, మి త్ర పక్షాలకు 40 నుంచి 44 సీట్లు వస్తాయని జోస్యం చెప్పగా ఆప్‌కు 25 నుంచి 29 సీట్లు రావచ్చునని సూచించింది.
పిమార్క్ ఎగ్జిట్ పోల్ బిజెపి, మిత్ర పక్షాలకు 3949 సీట్లను ఆప్‌కు 2131 సీట్లను సూచించింది. జెవిసి ఎగ్జిట్ పోల్ బిజెపి మిత్ర పక్షాలకు 3945 సీట్లు, ఆప్‌కు 2231 సీట్లు వస్తాయని అంచనా వేసింది. చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ బిజెపి మిత్ర పక్షాలకు 3944 సీట్లు, ఆప్‌కు 2528 సీట్లు రావచ్చునని అన్నది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు బిజెపికి భారీ సీట్ల సంఖ్యను సూచించాయి. బిజెపి4961 సీట్లతో అఖండ విజయం సాధిస్తుందని, అధికార పార్టీకి 1019 సీట్లు వస్తాయని సిఎన్‌ఎక్స్ జోస్యం చెప్పింది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ఎన్‌డిఎకు 51 నుంచి 60 సీట్లు లభించవచ్చునని, ఆప్‌కు 1019 సీట్లు రావచ్చునని సూచించింది.
రెండు సర్వేలు ఆప్ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పాయి. వీ ప్రిసైడ్ ఆప్‌కు 4652 సీట్లు, బిజెపికి 1823 సీట్లు వస్తాయని సూచించగా మైండ్ బ్రింక్ మీడియా ఆప్‌కు 4449 సీట్లు, బిజెపికి 2125 సీట్లు, కాంగ్రెస్‌కు 01 సీటు రావచ్చునని సూచించింది. మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ 3540 సీట్లు, ఆప్ 3237 సీట్లు గెలుస్తాయని జోస్యం చెప్పింది. డివి రీసర్చ్ ఆప్‌కు 2634 సీట్లు, బిజెపి మిత్ర పక్షాలకు 3644 సీట్లు వస్తాయని సూచించింది. కాంగ్రెస్‌కు ఒక్క సీటూ రాదని అది జోస్యం చెప్పింది. అధిక సంఖ్యాక సర్వేలు కాంగ్రెస్‌కు 01 సీట్లు సూచించగా, చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ వంటి సర్వేలు కొన్ని ఆ పార్టీకి రెండు నుంచి మూడు సీట్లు రావచ్చునని జోస్యం చెప్పాయి.