Friday, November 22, 2024

తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆగస్టులో దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం ఊరటనిచ్చింది. గత నెలలో వినియోగ ధరల సూచీ(సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 6.83 శాతానికి తగ్గింది. అంతకుముందు జులైలో ఇది 7.44 శాతంతో గరిష్ఠ స్థాయిలో ఉండగా, ఈసారి కాస్త తగ్గుముఖం పట్టింది. మంగళవారం కేంద్ర గణాంకాల శాఖ ఈ డేటాను విడుదల చేసింది. అయితే రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) పరిమితికి పైనే ఉంది.

ఇంకా కొంత మేరకు ద్రవ్యోల్బణం తగ్గాల్సి ఉంది. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతం దిగువకు చేరుకుంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. అయితే వారి అంచనాలకు తగ్గట్టుగానే ద్రవ్యోల్బణం దిగొచ్చింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే పట్టణాల్లో ద్రవ్యోల్బణం 6.59 శాతంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో 7.02 శాతంతో కొంత అధికంగా ఉంది. కూరగాయల ధరల్లో క్షీణత రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదలలో కీలకంగా ఉంది. అయితే పప్పు ధాన్యాలు, పాలు, పండ్లు వంటి ఆహార పదార్థాల ధరలు ఆగస్టులలో స్వల్పంగా పెరిగాయి. ఆహార ద్రవ్యోల్బణం ఆగస్టులో 9.94 శాతానికి తగ్గింది. ఇది జులైలో 11.51 శాతంగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News