- Advertisement -
న్యూఢిల్లీ : డిసెంబర్ నెలలో వినిమయ ధరల సూచీ(సిపిఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.59 శాతానికి పెరిగింది. నవంబర్‌లో ఇది 4.91 శాతంగా ఉంది. ఈమేరకు కేంద్ర గణాంకాల శాఖ(ఎన్‌ఎస్‌ఒ) డేటాను విడుదల చేసింది. ఆహార ద్రవ్యోల్బణం 1.87 శాతం నుంచి 4.05 శాతానికి పెరిగింది. ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ద్రవ్యోల్బణం లక్షం పరిధి 2 నుంచి 6 శాతంగా నిర్ణయించింది.
పారిశ్రామిక ఉత్పత్తి క్షీణత
2021 నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి క్షీణించింది. ఐఐపి(పారిశ్రామిక ఉత్పత్తి సూచీ) 1.4 శాతంగా ఉంది. అంతకుముందు అక్టోబర్ నెలలో ఇది 4 శాతంగా ఉంది.
- Advertisement -