Monday, December 23, 2024

రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది

- Advertisement -
- Advertisement -

నవంబర్‌లో 5.55 శాతంతో మూడు నెలల గరిష్ఠానికి సూచీ

న్యూఢిల్లీ : ఆహార ధరల పెరుగుదల కారణంగా నవంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.55 శాతానికి పెరిగింది. ఈ సూచీ మళ్లీ మూడు నెలల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం చేరడం గమనార్హం. అక్టోబర్‌లో నాలుగు నెలల కనిష్ట స్థాయి 4.8 శాతంగా ఉండగా, నవంబర్‌లో ఇది 5.55 శాతానికి పెరిగింది.

ఈమేరకు మంగళవారం కేంద్ర గణాంకాల శాఖ గణాంకాలను విడుదల చేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడానికి ఆహార ధరలు భారీగా పెరగడమే కారణమని డేటా పేర్కొంది. నవంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 8.70 శాతానికి పెరగ్గా, ఇది అక్టోబర్‌లో 6.61 శాతంగా ఉంది. నవంబర్‌లో ద్రవ్యోల్బణం గణాంకాలు ఆర్‌బిఐ లక్షం 2 నుంచి -6 శాతం పరిధిలోనే ఉన్నాయి. గత వారం ఆర్‌బిఐ 2023-24 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా అంచనా వేసింది.

మూడో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం రేటు 5.6 శాతం, చివరి త్రైమాసికంలో 5.2 శాతం అంచనా వేసింది. ధరల పెరుగుదల ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం రేటు ఆర్‌బిఐ పరిధిలోనే ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాల ఆధారంగా ఆర్‌బిఐ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంటుంది. అయితే గతవారం ఆర్‌బిఐ ఎంపిసి వడ్డీ రేట్లను 6.50 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. అక్టోబర్‌లో దేశ పారిశ్రామికోత్పత్తి 16 నెలల గరిష్ఠ స్థాయి 11.7 శాతానికి చేరుకోగా, ఏడాది క్రితం ఇదే కాలంలో 4.1 శాతానికి క్షీణించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News