Thursday, September 19, 2024

నాగార్జున సాగర్ వద్ద కూలిపోయిన సుంకిశాల రిటెయినింగ్‌ వాల్…. తప్పిన పెను ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల రిటెయినింగ్‌ వాల్ కూలిపోయింది.  కూలీలు షిఫ్టు మారే సమయంలో రిటెయినింగ్ వాల్ కూలిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా రిటెయినింగ్‌ వాల్‌ కుప్పకూలడంతో సుంకిశాల పంపుహౌస్‌ నీట మునిగింది.  ఇక్కడ మూడు షిఫ్టుల్లో వందల మంది కూలీలు పనిచేస్తుంటారు. సరిగ్గా కూలీలు షిఫ్టు మారే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం వాటిళ్లలేదు. ఆగస్ట్ ఒకటో తేదీన ఉదయం ఆరు గంటలకు ఈ ఘటన జరిగినప్పటికి జలమండలి అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్టు సమాచారం.

సొరంగాన్ని పూర్తిస్థాయిలో ఓపెన్‌ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొరంగాల్లోకి సాగర్‌ జలాలు రాకుండా ఉండేందుకు రక్షణగా రిటెయినింగ్‌ వాల్‌ నిర్మించారు. నాగార్జున సాగర్ జలాశయం డెడ్‌స్టోరీజీ చేరుకున్నప్పుడు హైదరాబాద్‌కు కృష్ణా జలాల తరలింపు కోసం సుంకిశాల పంప్‌హౌస్‌ను నిర్మించిన విషయం విధితమే. సుంకిశాల సొరంగాల్లోకి సాగర్ జలాలు రాకుండా ఉండేందుకు రిటెయినంగ్ వాల్ నిర్మించారు. నాగార్జునసాగర్‌కు లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో నీటిమట్టం కూడా భారీగా పెరిగిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News