Sunday, February 23, 2025

ఏడవ అంతస్తు నుంచి దూకి రిటైర్డ్ ఎసిపి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ముంబై: ఏడంతస్తుల భవనంపై నుంచి దూకి ఒక రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు(ఎసిపి) ఆత్మహత్య చేసుకున్నారు.జ సెంట్రల్ ముంబైలోని మాతుంగ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దీధర్ రోడ్డులోని గంగా హెరిటేజ్ భవనంలో జరిగిన ఈ ఘటన వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదని మంగళవారం పోలీసులు తెలిపారు.

2014లో ముంబై పోలీసు శాఖ నుంచి ఎసిపిగా పదవీ విరమణ చేసిన 70 ఏళ్ల ప్రదీప్ ప్రభాకర్ టేంకర్ గత కొన్నేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతునారని, ఆందుకోసం చికిత్స కూడా తీసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. తాను నివసించే భవనంలోని ఏడవ అంతస్తు నుంచి దూకి ఆయన ఆత్మహత్య చేసుకున్నారని వారు చెప్పారు. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేసుకున్న మాతుంగ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News