- Advertisement -
అమరావతి: తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది, ఏర్పేడు మండలం మేర్లపాక దగ్గర రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతదేహం లభించింది. కేరళలోని త్రివేండ్రానికి చెందిన జిజో థామస్‌గా గుర్తించారు. ఈ నెల 12న ఢిల్లీ నుంచి తివేండ్రం వస్తుండగా అదృశ్యమయ్యాడు. జిజో థామస్ గత నెల 30వ తేదీన రిటైర్డ్ అయ్యాడు. మృతదేహం మేర్లపాక గ్రామ శివారులో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు జిబో థామస్‌గా గుర్తించారు. కానీ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: బాసర అమ్మవారిని దర్శించుకున్న కెటిఆర్ కుమారుడు
- Advertisement -