Thursday, December 26, 2024

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వినతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు: రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మోత్కూరు యూనిట్ సభ్యులు తహశీల్దార్ షేక్ అహ్మద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెన్షనర్లకు ఆస్పత్రుల్లో క్యాష్ లెస్ చికిత్స కోసం ఇహెచ్‌ఎస్ అమలు చేయాలని, బకాయి ఉన్న కరువు భత్యం వెంటనే మంజూరు చేయాలని, నూతన పిఆర్సి ఏర్పాటు చేయాలని, కమ్యూటేషన్ 15 ఇళ్ల నుంచి 12 ఏళ్లకు కుదించాలని, రీయంబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిఎం కెసిఆర్ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బద్దం యాదిరెడ్డి, కార్యదర్శి వల్లభాయి, కోశాధికారి యాదగిరి, మాజీ అధ్యక్షుడు మర్రి ఆనందం, జిల్లా ఉపాధ్యక్షుడు హెచ్.చందర్ రావు, మనోహరాచారి, అంజయ్య, సిహెచ్.భిక్షం, అవిశెట్టి అవిలిమల్లు, కె.రవీందర్ రెడ్డి, ఎ.సత్యనారాయణ, బి.వెంకటేశ్వర్లు, వి.వీరయ్య, ఎస్.భాస్కరాచారి, ఎండి.గుంషావలీ, ఎ.సత్తయ్య, ఎం.రామయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News