Sunday, December 22, 2024

లిఫ్టులో శునకం: మహిళపై మాజీ ఐఎఎస్ దౌర్జన్యం(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

నోయిడ: లిఫ్టులో పెంపుడు కుక్కను తీసుకురావడంపై ఏర్పడిన వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. పెంపుడు శునకాన్ని తీసుకువచ్చిన మహిళపై రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఒకరు చేయిచేసుకోవడం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉత్తర్ ప్రదేశ్‌లోని నోయిడాలో సెక్టార్ 108కి చెందిన పార్క్ లారియేట్ సొసైటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధిచి ఆ రిటైర్డ్ ఐఎఎస్ అధికారిపై ఫిర్యాదు నమోదైంది.

వాగ్వివాదాన్ని ్తతన సెల్‌ఫోన్‌లో వీడియో రికార్డు చేస్తున్న మాజీ ఐఎఎస్ అధికారి ఆర్‌పి గుప్తాను ఆ మహిళ అడ్డుకోవడానికి ప్రయత్నించగా అందుకు ఆయన ఆ మహిళ చెంప చెళ్లుమనిపించారు. ఆత్మరక్షణార్థం ఆ మహిళ ఆయనపై చేయి లేపడం కూడా సిసిటివి కెమెరాలో రికార్డయింది.

పెంపుడు శునకాన్ని లిఫ్టులో తీసుకెళ్లడంపై ఘర్షణ చోటుచేసుకుంది. ఉభయులతో మాట్లాడుతున్నాము. సిసిటివి ఫుటేజ్ పరిశీలిస్తున్నాము. దర్యాప్తు తర్వాత తగిన చర్యలు తీసుకుంటాము అని గౌతమ్ బుద్ధ నగర్ పోలీసు కమిషనరేట్ సోషల్ మీడియాలో పేర్కొంది..

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News