Wednesday, December 18, 2024

అధికార పార్టీ భూదాహం వల్లే రిటైర్డ్ ఎంపిడిఒ హత్య

- Advertisement -
- Advertisement -

జనగామ : అధికార పార్టీ ప్రజాప్రతినిధుల భూదాహం వల్లే జనగామ నియోజకవర్గంలో అరాచకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, భూకబ్జాలను వెలుగులోకి తెస్తున్నందుకే రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్యను హత్య చేశారని కాంగ్రెస్ పార్టీ పీసీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం జనగామలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ హతుడి కుమారుడు తన తండ్రి హత్యకు కారణం అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులేనని,

పేర్లతో సహా చెబుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబం పక్షాన ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఆయనవెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News