Sunday, January 19, 2025

రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. మాజీ పోలీస్ అధికారి కాల్చివేత

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లా రిటైర్డ్ పోలీస్ అధికారి మొహమ్మద్ షఫీ మీర్‌ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. గంట్ ముల్లా గ్రామం లోని షీరి ప్రాంతంలో ఉన్న మసీదులో ఆదివారం నాడు ప్రార్థనలు చేస్తుండగా, షఫీపై గుర్తు తెలియని సాయుధులు కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. భద్రతా బలగాలు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ అధీనం లోకి తీసుకున్నారు.

ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. జమ్ముకశ్మీర్ పోలీస్‌శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా షఫీ పనిచేసినట్టు గుర్తించారు. పోలీస్ అధికారిని తామే కాల్చి చంపినట్టు ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. రాజోరి సెక్టార్‌లో ఎల్‌ఒసి వెంబడి ఉగ్రవాదులు గత గురువారం నాడు జరిపిన దాడిలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన క్రమంలో తాజా ఘటన చోటు చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. గత నెల శ్రీనగర్‌లో ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

పూంచ్ జిల్లాలో జవాన్లను తరలిస్తున్న సైనిక వాహనాలపై పక్కా ప్రణాళికతో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే..మరోవైపు పూంచ్ సెక్టార్‌లో దాదాపు 30 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు నక్కినట్టు భారత సైన్యం అంచనా వేస్తోంది. శుక్రవారం రాత్రి నలుగురు ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో అంతర్జాతీయ సరిహద్దును దాటేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా సిబ్బంది కాల్పులు జరపడంతో ఒక ఉగ్రవాది మృతి చెందినట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News