- Advertisement -
న్యూఢిల్లీ : కంపెనీ చట్టాల వ్యవహారాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రెండు ప్రధాన ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌ఎటి) ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్‌ను నియమించారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) అధ్యక్షులుగా జస్టిస్ రామలింగం సుధాకర్‌ను నియమించారు. ఆయన మణిపూర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. వీరిద్దరిని ఈ రెండు ట్రిబ్యునల్స్‌కు శాశ్వత స్థాయి అధ్యక్షులుగా ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు.
- Advertisement -