కరీంనగర్ నుంచి ముల్కనూర్ వైపు వెళ్తున్న రిటైర్డ్ ఎస్‌ఐ పాపయ్య నాయక్ అతి వేగంగా నడపడంతో వ్యవసాయ బావిలోకి దూసుకుపోయిన కారు
గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు సాగిన గాలింపు చర్యలు బావిలోని నీరు తోడడంతో బయటపడిన కారు, శవమై తేలిన పాపయ్య నాయక్
మన తెలంగాణ/చిగురుమామిడి: అతివేగంతో వచ్చిన కారు అదుపు తప్పి వ్యవసాయ బావిలో పడిన విషాద సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్‌లో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే కరీంనగర్ నుండి చిన్న ముల్కనూర్ వైపు వస్తున్న కారులో రిటైడ్ ఎస్సై పాపయ్య నాయక్ అతీవేగంతో చిన్న ముల్కనూర్ శివారులోని బొందుగుల విజయెందర్ రెడ్డి వ్యవసాయ బావిలో బోల్తా కోట్టారు. స్థానికుల సమాచారంతో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయసారధి, తిమ్మాపూర్ సీఐ శశిధర్‌రెడ్డి, చిగురుమామిడి ఎస్సై చల్లా మధుకర్ రెడ్డి హుటహుటినా ఘటన స్థలానికి చేరుకోని రెండు క్రేన్ల సహాయంతో, ఎల్‌ఎండి గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం 11 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో కారుకు సంబంధించిన వివరాలు, అందులో ఉన్న వారి వివారాలు రాత్రి వరకు తెలియరాలేదు. రాత్రి వరకు మోట్లర్ల సహాయంతో, ఇంజన్ సహాయంతో బావిలోని నీటిని బయటకు తీశారు. దీంతో కారు ను బావిలో నుండి బయటకు తీయగా అందులో పాపయ్య నాయక్ ఒక్కరిదే మృతదేహాం లభించింది. భీమాదేవరపల్లి మం డల గట్ల నర్సింగాపూర్ గ్రామానికి చెందిన పాయ్యనాయక్ ఇటివలే రిటైడ్ అయి కరీంనగర్‌లో నివాసం ఉంటున్నారు. మృ తదేహాం వద్ద కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటయి. ఘటన స్థలానికి చిగురుమామిడి ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పిటీసీ సభ్యుడు గీకురు రవీందర్, తహసీల్ధార్ ముబిన్ హైమద్, సర్పంచ్ వెంకటనర్సింహారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ సాంబారి బాబు, నాయకులు పెసరి రాజేశంలు చేరుకోని సహాయక చర్యలు అందించారు. కారులో పాపయ్య మృతదేహాం ఒక్కరిదే ఉండటంతో ప్రజలు, పోలీసులు ఉపీరి పిల్చుకున్నారు.
Retired SI Papaya dies after Car fell into Well