Sunday, December 29, 2024

సొంత పాఠశాలకు చేయూతనిచ్చిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు

- Advertisement -
- Advertisement -

పసి చేసిన పాఠశాలకు చేయూత నివ్వడం మరింత ఆనందం ఇస్తుందని రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు మదుసూదన్ రెడ్డి అన్నారు. మండలంలోని హాసాకొత్తూర్ ఉన్నత పాఠశాలకు 12 వేల రూపాయల విలువ గల మూడు గ్రీన్ బోర్డులను ఆయన అతిథుల చేతుల మీదుగా పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, పని చేసి పదవి విరమణ పొందిన పాఠశాలకు చేయూతనిచ్చే అవకాశం రావడం ఆనందమన్నారు. మండలంలోని అత్యున్నత ఫలితాలు సాధించి అధిక మొత్తంలో 10 జీపీఏ పాయింట్లు సాధించాలని ఆయన విద్యార్థులకు సూచించారు.

మండల విద్యాధికారి ఆంధ్రయ్య, ఉపసర్పంచ్ రాజేశ్వర్‌లు మాట్లాడుతూ పదవి విరమణ పొందిన కూడా ప్రభుత్వ పాఠశాలకు చేయూతనివ్వడం అభినందనీయమని అన్నారు. కోరిన వెంటనే పాఠశాలకు గ్రీన్ బోర్డులు అందించిన మధుసూదన్ సార్‌కు ప్రధానోపాధ్యాయులు కృష్ణకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల తరపున మధుసూదన్ రెడ్డికి అథిధులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి నోముల రజిత నరేందర్, పాఠశాల విద్యా కమిటి చైర్మన్ శ్రీనివాస్, గ్రామ అభివృద్ధి కమిటి అధ్యక్షుడు బద్దం రాకేష్, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు కిరణ్ తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News