Friday, April 11, 2025

వక్ఫ్ బోర్డు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచాలి

- Advertisement -
- Advertisement -

మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వినతి

హైదరాబాద్ : రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ సెంట్రల్ యూనియన్ ప్రతినిధులు కోరారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ సెంట్రల్ యూనియన్ ప్రతినిధులు మంగళవారం మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితి పెంచినప్పటికీ వక్ప్ బోర్డు మాత్రం 61-60 సంవత్సరాలకు పైబడిన విరమణ వయస్సు పరిమితిని తగ్గించిందని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేస్తూ వక్ఫ్ బోర్డుకు సూచించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు మామిండ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ ముజీబ్, ప్రవీణ్ తో పాటు ఇతర ప్రతినిధులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News