- Advertisement -
హైదరాబాద్: జలమండలి పరిధిలోని డివిజన్లలో విధులు నిర్వహించిన ఇద్దరు ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. గురువారం ఖైరతాబాద్ లోని బోర్డు ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. పదవీ విరమణ ద్వారా లభించే గ్రాట్యూటీ వంటి తదితర ప్రయోజనాలు చెక్కు రూపంలో వీరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఅండ్‌ఏ సీజీఎం మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, జీఎం సరస్వతితో పాటు పలువురు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -