Monday, January 20, 2025

ఈ సీజన్ తర్వాత ఆటకు వీడ్కోలు

- Advertisement -
- Advertisement -

Retirement to the tennis after this season:Sania Mirza

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా

మెల్‌బోర్న్: ప్రస్తుత సీజన్ తన తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతానని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రకటించింది. 2022 చివరి వరకు టెన్నిస్‌లో కొనసాగుతానని, ఆ తర్వాత ఆట నుంచి తప్పుకుంటానని వెల్లడించింది. ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా తొలి రౌండ్‌లోనే ఓటమి పాలైంది. ఉక్రెయిన్ క్రీడాకారిణి నదియా కిచ్నోక్‌తో కలిసి సానియా మహిళల డబుల్స్‌లో బరిలోకి దిగింది. అయితే సానియా జంటకు తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. అయితే మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సానియా ఇంకా తలపడాల్సి ఉంది. కాగా, మహిళల డబుల్స్ ఓటమి తర్వాత సానియా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించింది. కొన్ని రోజులుగా తనను గాయాలు వెంటాడుతున్నాయని తెలిపింది. మోకాలు, మోచేయి నొప్పితో బాధపడుతున్నట్టు వివరించింది. ఇప్పటికే 35 ఏళ్లకు చేరుకున్నాను. ఇలాంటి స్థితిలో పూర్తి ఫిట్‌నెస్‌తో ఆటను కొనసాగించడం అనుకున్నంత తేలికకాదు.

ఈ సీజన్ తర్వాత ఆటకు పూర్తిగా వీడ్కోలు పలకాలనే నిర్ణయానికి వచ్చేశాను. కిందటి ఏడాదే దీనిపై ఓ స్పష్టతకు వచ్చాను. ఇక ఈ సీజన్‌ను విజయవంతంగా ముగించడమే ఏకైక లక్షంగా పెట్టుకున్నా. కనీసం యూఎస్ ఓపెన్ వరకు ఆటలో కొనసాగించాలని భావిస్తున్నా. చివరి సీజన్‌లో మెరుగైన ఆటను కనబరిచేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తా. తల్లి అయిన తర్వాత ఫిట్‌నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమించా. గతంతో పోల్చితే ప్రస్తుతం తన ఫిట్‌నెస్ మెరుగ్గా ఉండడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ కాలం టెన్నిస్‌లో కొనసాగడం సులభమేమి కాదు. దీంతో ఆట నుంచి తప్పుకోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చా. ఇక సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలను సొంతం చేసుకున్నాను. ఇదే క్రమంలో ఎన్నో అవమానాలు, ఇబ్బందులను ఎదురకొన్నాను. అయితే క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే చాలా కీలకం.

వారి అండ వల్లే తాను మెరుగైన క్రీడాకారిణిగా ఎదిగానని సానియా స్పష్టం చేసింది. ఇదిలావుండగా సానియా తన కెరీర్‌లో ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించింది. ఇందులో మూడు మహిళల డబుల్స్ విభాగంలో లభించగా మరో మూడు మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో లభించాయి. అంతేగాక డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సానియా నంబర్‌వన్‌గా కూడా నిలిచింది. దీంతో పాటు మహిళల సింగిల్స్‌లో 27వ ర్యాంక్‌లో నిలిచి చరిత్ర సృష్టించింది. పురుషుల విభాగంలో లియాండర్ పేస్, మహేశ్ భూపతి తర్వాత సానియా మీర్జానే గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో టైటిల్స్ సాధించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News