- Advertisement -
న్యూఢిల్లీ : పన్ను పరిధిలో మరింత మందిని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ప్రభుత్వం పన్ను పరిమితి లోబడి ఉన్న వ్యక్తులు అయినప్పటికీ టిడిఎస్, టిసిఎస్ రూ.25,000 దాటితే గనుక ఫైలింగ్ రిటర్న్ చేసేలా చర్యలు చేపట్టింది. కొత్త నిబంధన ప్రకారం, ఆర్థిక సంవత్సరంలో టిడిఎస్(టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్), టిసిఎస్ (టాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) రూ.25 వేలు దాటితే రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇదే సీనియర్ సిటిజెన్‌లకు అయితే రూ.50 వేల పరిమితి విధించారు. కొత్త నిబంధన ఏప్రిల్ 21 నుంచి అమల్లోకి వచ్చింది.
- Advertisement -