Sunday, December 22, 2024

నా భూమి తిరిగిచ్చేయ్

- Advertisement -
- Advertisement -

కెటిఆర్ ను ధైర్యంగా నిగ్గదీసిన సిరిసిల్లా మహిళా రైతు

సిరిసిల్లా: తెలంగాణ రాష్ట్రంలో మే 13 పోలింగ్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో కెటిఆర్ విస్తృతంగా రాజకీయ ప్రచారం చేస్తూ కలియ తిరుగుతున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా మహిళా రైతు బి. లక్ష్మి భూమిని మెడికల్ కాలేజ్ కోసం సేకరించారు. కాగా ఇప్పుడు ఓట్ల కోసం ప్రచారం చేస్తున్న కెటిఆర్  స్థానికులతో మాటామంతీ చేశారు.

లక్ష్మి ఎంఎల్ఏ కెటిఆర్ తో కరచాలనం చేసి తన రెండెకరాలు పోయాయని చెప్పుకుంది. దానికి కెటిఆర్ కలెక్టర్ తో మాట్లాడి ఆమె భూమిని ఆమెకు వచ్చేట్లు చేస్తానని హామీ ఇచ్చారు.

‘బాధ పడకు, నేను నీ భూమి దక్కేలా చేస్తాను’ అని కెటిఆర్ అన్నాక, ఆ మహిళ ‘ఎప్పుడు?’ అని వెంటనే ప్రశ్నించింది. అప్పడు అక్కడ ఉన్న బిఆర్ఎస్ కేడర్, స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. భూమి పోయాక తాను చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ఆ మహిళ కెటిఆర్ కు చెప్పుకుంది. ‘నీకు నీ భూమి దక్కుతుంది’ అని కెటిఆర్ నమ్మబలికాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News